టీచర్ ఉద్యోగాలు సాధించిన 23 మందికి అభినందన సత్కార కార్యక్రమం
ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఉచిత టెట్ డీఎస్సీ కోచింగ్ లో 23 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించడంతో వారికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన 23 మంది మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కువమంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలని ఉద్దేశంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా సకల వసతులు కల్పించి బెస్ట్ పేకాలిటితో బెస్ట్ మెటీరియల్ తో చక్కని వసతి, భోజన వసతి తో పాటు మా స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేసి మమ్మల్ని ఈ రోజు టీచర్లుగా ఉద్యోగాలు సాధించడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి, జ్యోతుల నవీన్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు జీవిత కాలం రుణపడి ఉంటామని మా కన్న తల్లిదండ్రులు జన్మనిస్తే మీరు మాకు పునర్జన్మని ఇచ్చి ఈరోజు టీచర్లుగా భావితరాలకు విద్యను అందించే అవకాశాన్ని కల్పించడం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఫౌండేషన్ డిఎస్సీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తొలి ప్రయత్నం లోనే కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా మంచి రిజల్ట్స్ సాధించామని దీనికి ముఖ్య కారణం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డెడికేషనని జ్యోతుల నవీన్ అంకిత భావం, జ్యోతుల మణి అన్నపూర్ణల ఆదరించి అన్నం పెట్టడం వలనే సాధించామని అన్నారు. జ్యోతుల మణి, నవీన్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మీ అందరికీ ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో ఏర్పాటైన ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్ కు 400 మంది పైబడి కోచింగ్ తీసుకుంటే ఈరోజు 23 మంది ఉపాధ్యాయులుగా ఉద్యోగం సాధించడం చాలా ఆనందంగా ఉందని చాలామంది అర మార్కు, ఒక మార్కు తేడాతో క్వాలిఫై అవ్వకపోవడం చాలా దురదృష్టకరమని అయినా వారికి కూడా మీలాగే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ, ప్రైవేటు సంస్థల్లోనూ ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ విద్యార్థులకు విద్యావ్యవస్థ ద్వారా అన్ని మౌలిక వసతులు కల్పించాలని లక్ష్యంతో ఏర్పడిందని అందులో భాగంగా స్కూల్స్ కి బెంచీలు కుర్చీలు, ఫ్యాన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా వృద్ధాశ్రమం కూడా ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఆడబిడ్డకు పెళ్ళికానుక, ఆటో కార్మికులకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూనే గత నాలుగు సంవత్సరాలుగా ఉచిత అన్నా క్యాంటీన్ జగ్గంపేటలో ఏర్పాటు చేసి కార్యకర్తల సహకారంతో నడిపిస్తున్నామని దీనికి అన్ని విధాల సహకరిస్తున్న నాగేంద్ర చౌదరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నామని అన్నారు. డీఎస్సీ కోచింగ్ కష్టపడి పని చేసిన జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ డీఎస్సీ కోచింగ్ కమిటీ 13 మంది సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, అడప భరత్, కొత్తకొండ బాబు, పోతుల మోహన్ రావు, వీరం రెడ్డి కాశి బాబు, పిల్లా చంటిబాబు,బస్వా వీరబాబు, తోట రవి, కోర్పు సాయి తేజ, గాంధీ, అడబాల భాస్కరరావు, ఉంగరాల రాము, పాలచర్ల నాగేంద్ర చౌదరి, పాఠం శెట్టి రవి, సొసైటీ ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్చార్జిలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కమిటీ సభ్యులు నీలం చక్రధర్, తోలేటి సూర్యనారాయణ, ముమ్మిడివరపు సురేష్, కంటే ఉదయభాస్కర్, గద్దే మారుతి, పడాల బాలాజీ, పుర్వేశ్వరన్న, రఘురామరాజు, అడపా తాతాజీ, సిహెచ్ జోసఫ్, బుద్ధా జి, తదితరులు పాల్గొన్నారు.