14 October 2025
Tuesday, October 14, 2025

జ్యోతుల నెహ్రూ షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారుల అభినందనలతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఘన సత్కారం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ప్రభుత్వం ద్వారా పి ఫోర్, ఆదరణ పథకంలో స్వయం ఉపాధికి అవకాశం కల్పిస్తా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని టిడిపి కార్యాలయంలో జగ్గంపేట జ్యోతుల నెహ్రూ కాంప్లెక్స్24మంది చిరు వ్యాపారస్తులందరూ కలిసి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను, జిల్లా టిడిపి అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా షాపింగ్ కాంప్లెక్స్ సభ్యులు ఆశీర్వాద్ రియల్ ఎస్టేట్ కింతాడ రాజు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిరు వ్యాపారస్తులకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ లు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది 24 కుటుంబాలు తద్వారా లబ్ధి పొందడం జీవితాంతం వారికి రుణపడి ఉంటామని అన్నారు. జ్యోతుల నవీన్ మాట్లాడుతూ చిరు వ్యాపారస్తులందరూ అనేక సంవత్సరాలుగా షాపులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని వారికి ఎమ్మెల్యే సహకారంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ 24 మంది ఒక్కొక్కరిగా పరిచయం చేసుకుని వారు చేస్తున్న వ్యాపారాలను అడిగి తెలుసుకున్నారు. మీ షాపుల నిర్మాణం కోసం జ్యోతుల నవీన్ పూర్తి బాధ్యత తీసుకుని మీ అందరికీ న్యాయం చేశాడని ఈ కాంప్లెక్స్ లో ఉన్న అందరికీ ప్రభుత్వం ద్వారా పి4 ఆదరణ పథకం ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, వాసిరెడ్డి ఏసుదాసు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, పాలచర్ల నాగేంద్ర చౌదరి, రాయి సాయి, సత్తి సదాశివరెడ్డి, గెద్దాడ సత్యవేణి, పీల మహేష్, సాంబత్తుల చంద్రశేఖర్, తుమ్మల కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo