కైట్ ఇంజనీరింగ్ కాలేజీలో 2006 సంవత్సరం విద్యార్థి సరగం శ్రీధర్ ఆయన కైట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఒక అమెరికన్ కంపెనీకి వైస్ చైర్మన్ గా ఉంటూ గడిచిన 19 సంవత్సరాలలో ఎంతో మంది ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించారని అటువంటి వ్యక్తి ఈరోజు కైట్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు తన ఎదుగుదలను వివరించి వారిని కూడా మంచి ప్రయోజకులను చెయ్యాలని ఉద్దేశంతో వారికి ఇంటర్వ్యూలో ఏ విధంగా సమాధానాలు చెప్పాలి అనే దానిపై సుమారు 400 మంది విద్యార్థులకు అవగాహన కల్పించారనీ ప్రస్తుతం శ్రీధర్ సాఫ్ట్వేర్ కంపెనీల అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీగా ప్రభుత్వం తరఫున ఎక్కడైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి ఏదైనా మీట్ పెడితే శ్రీధర్ అక్కడకు వెళ్లి మొత్తం ఆ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేస్తారని కైట్ ఇంజనీరింగ్ విద్యాసంస్థల చైర్మన్ పోతుల విశ్వం మీడియాకు తెలియజేశారు, ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ రామకృష్ణ, గోపి ,వై శ్రీనివాస్, ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

