ఈ-కంటి వెలుగు కార్యక్రమం పునరుద్ధరించాలి…
వైయస్సార్ సిపి ఐటి వింగ్ కన్వీనర్ వెంకన్న బాబు…
మానవ శరీరంలో కీలకంగా వ్యవహరించే భాగాలలో కళ్ళు ఒకటి అలాంటి కళ్ళు మూతపడితే వారి జీవితం అంధకారంలో వెళ్లినట్టే, అలాంటి కళ్ళకు సమస్య వస్తే పరిష్కరించుకోవడానికి ప్రభుత్వ ఆస్పత్రిలో ముఖ్యమంత్రి ఈ – కంటి వెలుగు కార్యక్రమం ఉండేది కానీ సంవత్సర కాలంగా నిలిపివేశారు ప్రజల కళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ పాలకుల తీరును ఎండగట్టి తీవ్రంగా ఖండించిన మండపేట వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ వైయస్సార్ సిపి ఐటి వింగ్ కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు. గురువారం పార్టీ ప్రధానకార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి e – కంటి చూపులు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమందికి కంటి సంరక్షణ సేవలను అందించడంలో సంచలనం సృష్టించారని కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజులలోనే గత సంవత్సరం సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి పరీక్షా కేంద్రాలను మూసివేశారని ఇలాంటి హేయమైన చర్యల వల్ల విద్యార్థులు, పేదప్రజల, వృద్ధులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాగా ఉన్నప్పుడు 13 ఆస్పత్రులలోను, డా.బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత 5 సి.హెచ్.సి లలోను ఈ పథకం ద్వారా ఎంతోమందికి మేలు చేకూరిందని రోజు కంటి వైద్యం కోసం మండపేట సీహెచ్ సీ కి పట్టణం పరిసర గ్రామాల నుంచి నెలకి 600 మంది వరకు వచ్చి వైద్యం చేయించుకునేవారనీ ఇప్పుడు ఆ సేవలు లేక నేడు కంటి పరీక్షలకు రూ.500, కళ్లజోళ్లకు 2వేలు ఆ పై మాటే,ఆపరేషన్ అవసరమైతే 35వేల రూపాయిలుకు పైగా ప్రయివేటు అస్పత్రులకు దారపోస్తున్నారని సంక్షేమ పథకాలు తీసేసినట్లు e – కంటి వైద్యాన్ని కూడా అటకెక్కించారని సామాన్య పేద ప్రజల కంటి చూపు మి భాధ్యతగా ఎందుకు తీసుకోవట్లేదని ఆస్పత్రికి వచ్చి నిరాశతో వెనుతిరిగుతున్న కంటి సమస్య బాధితుల గోడును అర్థంచేసుకోవాలన్నారు. కంటి సమస్యలైన ఫంగస్, రెటీనా వంటి వాటికి ఆటోమేటెడ్ డిజిటల్ పరికరాలతో ఫండస్ కెమెరా, ఆటోరిఫ్రాక్టర్ లాంటి కంటి స్క్రీనింగ్ పరికరాలతో డిజిటల్ టెక్నాలజీలు వినియోగంలో అనుభవజ్ఞులైన నేత్ర వైద్య నిపుణులు ఆప్టోమెట్రిస్టులు సాంకేతిక బృందం ద్వారా వైసీపీ ప్రభుత్వం అందించిన ముఖ్యమంత్రి e -కంటి చూపులు అవశ్యకతను గుర్తించి ప్రజల కోరికమేరకు పునఃప్రారంభించాలని గతంలో కూడా ప్రజల తరుపున డిమాండ్ చేయడం జరిగిందని యరమాటి వెంకన్నబాబు గుర్తుచేశారు

