ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
అమలు కాని హామీలు ఇచ్చి అందలం ఎక్కి ఇపుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారం ను వైసిపి శ్రేణులు తిప్పి కొట్టాలని వైసీపీ పి ఏ సి సభ్యులు, మండపేట నియోజక వర్గ వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు.మండపేట టౌన్, రూరల్ వైసిపి కార్యకర్తల సమావేశం సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సమావేశంలో తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆమలు చేయలేని హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.ఈ విషయాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని తోట సూచించారు. గత ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు సౌకర్యం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి వంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ప్రతి గ్రామంలో ఈ మోసాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కార్యకర్తలకు ఆదేశించారు. వైసిపి పరిశీలకులు కటకంశెట్టి ఆదిత్యకుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్ ఎన్నికల్లో నెగ్గడానికి అమలుకాని హామీలు ఇవ్వలేదని పేర్కొన్నారు. కేశవరం సర్పంచ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ హామీని నెరవేర్చగలరా అని సవాల్ చేశారు. టౌన్ రూరల్ వైసిపి మండల కమిటీ అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్ , అడబాల బాబ్జీ లు మాట్లాడుతూ అభివృద్ధి కంటే నాయకుల వ్యాపారాలకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది కూటమి నాయకులకు కూడా తెలుసునని ఎద్దేవా చేశారు. ప్రజల వద్దకు తిరగడానికి భయపడి ఒకటి రెండు కుటుంబాలను ఎంచుకుని తిరుగుతున్నారని విమర్శించారు.ఈ సమావేశంలో వైసిపి నాయకులు వేగుళ్ల పట్టాభి రామయ్య, కర్రి పాపారాయుడు,సిరిపురపు శ్రీనివాస్, దూలం వెంకన్నబాబు, మిండగుడితి శిరీష్, కుడిపూడి రాంబాబు, టేకుముడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.