కన్న కొడుకే తండ్రి పై విచక్షణా రహితంగా సుత్తితో పలుమార్లు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండల కేంద్రమైన రాయవరంలో చోటుచేసుకుంది. రాయవరం ఎస్సై సురేష్ బాబు తెలిపిన వివరాల మేరకు రాయవరం గ్రామంలోని,రాజరాజేశ్వరి కాలనీలో నివాసం ఉంటున్న గంటా శ్రీను కు భార్య ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు గంటా పవన్ కళ్యాణ్ దురలవాట్లు,చెడు సావాసాలకు అలవాటుపడి, గొడవలు తెస్తున్నాడని, తండ్రి గంటా శ్రీను మందలించడంతో, తరచుగా తిడుతున్నాడని తండ్రి పై కక్ష పెంచుకున్న పవన్ కళ్యాణ్ మద్యం మత్తులో, గురువారం రాత్రి భోజనం చేస్తున్న శ్రీను ను, విచక్షణా రహితంగా సుత్తితో తలపై పలుమార్లు దాడి చేసి గాయపరచ గా, రక్త గాయాలతో అపస్మారక స్థితిలో చేరుకున్న గంటా శ్రీను ను హుటాహుటిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతున్న శ్రీను ఇచ్చిన ఫిర్యాదుతో అతని కొడుకు గంటా పవన్ కళ్యాణ్ పై హత్యాప్రయత్నం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ బాబు తెలిపారు.