జనవిజ్ఞాన వేదిక నవ్యాంధ్ర రాష్ట్ర ప్రథమ అధ్యక్షుడు, మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ హోమియో వైద్యుడు సామాజిక కార్యకర్త డాక్టర్ చల్లా రవి కుమార్ మాతృమూర్తి లక్ష్మి (81) కన్నుమూశారు. శనివారం రాత్రి 10 గంటలకు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా స్వర్గీయ లక్ష్మి భౌతిక కాయాన్ని సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ జిల్లా కోశాధికారి కామ్రేడ్ కే కృష్ణవేణి, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు గండి స్వామి ప్రసాద్, లయన్ కురసాల వీర వెంకట సత్యనారాయణ, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సభ్యులు అద్దేపల్లి వీర్రాజు తదితరులు భౌతిక కాయనికి నివాళులర్పించారు