ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా, సోమవారం మండల కేంద్రమైన రాయవరం గ్రామానికి చెందిన, డ్రాయింగ్ టీచర్ ఇండుగమెల్లి సౌదాగర్, మందకృష్ణ మాదిగ చిత్రాన్ని వాటర్ కలర్స్ తో అందగా చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 31 సంవత్సరాల అలుపెరుగని పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాధించారని, అంతేకాక కేవలం ఎస్సీలకు మాత్రమే కాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య, వితంతు పింఛన్, వికలాంగుల సంక్షేమం వంటి ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టడానికి పోరాటం చేశారనే అభిమానంతో, ఈ చిత్రాన్ని రెండు గంటల సమయం వెచ్చించి లిఖించానని స్థానిక విలేకరులకు తెలిపారు