పర్యావరణాన్ని పరిరక్షిద్దాం….
మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదాన్ని ఆదర్శంగా తీసుకుని స్థానిక మండపేట మున్సిపల్ గ్రంధాలయం వద్ద గల రావిచెట్టు సెంటర్ లో గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా దంగేటి మణికంఠస్వామి ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిష్ట చేసి ప్రతిరోజు విశేష పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని అందులో భాగమై తాను కూడా పూర్తిగా మట్టితో తన స్వహస్తాలతో తయారు చేసిన ఈ మట్టి గణనాథుడిని ప్రతిష్టించడం జరిగిందని అన్నారు. గణేష్ ఉత్సవాలు చేసే యువకులు అందరూ కూడా తొలినాథుడు ఆదిదేవుడైన వినాయకుడిని మట్టితో తయారుచేసి పూజించడం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయని అంతేకాకుండా పర్యావరణాన్ని కాపాడే యజ్ఞంలో ఒక భాగం అవుతారని మణికంఠస్వామి అన్నారు.

