ముఖ్య అధితిగా పాల్గొన్న వేగుళ్ళ లీలాకృష్ణ…..
సెప్టెంబర్ 2వ తేదీన జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రామచంద్రపురం నియోజకవర్గం, కాజులూరు గ్రామంలో అన్యం శ్రీరామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో ముఖ్య అధితిగా రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు లీలాకృష్ణ కు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ శిబిరంలో రక్తదానం చేసిన దాతలు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

