మండపేట మండలం అర్తమూరు పంచాయితీ 7వ వార్డు సభ్యుడు మండపేట నియోజకవవర్గ టిడిపి డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు కాకర శ్రీనివాసరావు ఇటీవల గుండెపోటుతో మరణించటంతో ఆదివారం రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అర్తమూరు లో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాసరావు పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్ధించారు. ఈ పరామర్శలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, తిరుపతి వెంకటేశ్వరా వెటర్నరీ యూనివర్శిటి పాలకమండలి మాజీ సభ్యులు పడాల సుబ్బారెడ్డి, ఉపసర్పంచ్ కర్రి సత్యనారాయణరెడ్డి, బాబులు రెడ్డి, మల్లిడి సత్తిరాజు, చిర్ల వాసు, పంచాయితీ వార్డు మెంబర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.