పాత్రికేయులు వృత్తిధర్మంతో పాటు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని డా.ఓబుల్ రెడ్డి హెల్త్ కేర్&మల్టిస్పెషాలిటి సెంటర్ అధినేత,గుండెవ్యాధి నిపుణులు డా.గజ్జల ఓబుల్ రెడ్డి,జనరల్ సర్జన్ డా.మల్లాడి భార్గవి సూచించారు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్, కార్యదర్శి మోహన్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు,వారి కుటుంబ సభ్యులకు స్థానిక భానుగుడి వద్దగల జన్మభూమి పార్కు సమీపంలోని హెల్త్ కేర్ సెంటరులో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.తొలివిడతలో ముందుగా పేర్లు నమోదు చేసుకున్న సుమారు 50మంది పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సలహాలతో బాటు అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.రక్త,షుగర్,బీపీ టెస్ట్, 2డి ఎకో గుండె పరీక్షలు, గుండె స్కానింగ్,ఈసీజీ,తదితర పరీక్షలు నిర్వహించి తగిన జాగ్రత్తలు సూచించారు.అలాగే మహిళలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా అధ్యక్షుడు రాజేష్,కార్యదర్శి మోహన్,కార్యవర్గ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాస్,వెంకట రమణ,చిస్టీ,గుండు శ్రీను,సూర్యనారాయణ సీనియర్ పాత్రికేయులు అంజిబాబు, కృష్ణంరాజు, సాయినాధ్ తదితరులు వైద్యనిపుణులకు చిరు సత్కారం చేసి మెమెంటో బహూకరించారు. ఈసందర్భంగా డా.ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ విధినిర్వహణలో పాత్రికేయులు ఒత్తిడికి గురౌతారని, తద్వారా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రెస్ క్లబ్ సభ్యులు కోరిన వెంటనే ఉచితంగా పరీక్షలు నిర్వహించామన్నారు.పాత్రికేయులకు తక్కువ వ్యయంలో వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

