కొలంక కేశవస్వామికి వెండి కవచం బహుకరణ
రూ 7లక్షల విలువ చేసే వెండి కవచం అందజేత
కాజులూరు మండలం కోలంక గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ కేశవస్వామి వారికి క్షత్రియ పరిషత్ సభ్యులు వెండి కవచం బహుకరించారు. ఈమేరకు శనివారం 7 లక్షల రూపాయలు విలువచేసే వెండి కవచాన్ని ఆలయ అర్చకులు ఖండవల్లి శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో దంతులూరి వెంకట విజయ గోపాలకృష్ణంరాజు కృష్ణవేణి దంపతులచే సంప్రోక్షణ అనంతరం ఆలయ అర్చకులకు అందజేశారు. దంతులూరి కుటుంబీకులైన సాధు కృష్ణ వర్మ, వెంకట సత్యనారాయణ రాజు, వెంకట నరసింహారాజు, విశ్వనాథ వెంకటకేశవరాజు, కృష్ణ వర్మ, వెంకటరాఘవరాజు, సుబ్బరాజు, వెంకటతిరుపతిరాజు ఆర్థిక సహకారంతో సంయుక్తంగా స్వామి వారికి అందజేశారు. ఈ సందర్భంగా సాదు కృష్ణవర్మ మాట్లాడుతూ ఈపురాతన ఆలయానికి ఉన్న పేరు ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు ఇక్కడ చేసే అర్చనలకు భక్తులకు ఎంతో నమ్మకం ఉందని ఆ నమ్మకాన్ని మరింత విస్తృత పరిచేందుకుఇక్కడ జరుగుతున్న శుభకార్యాలు ప్రాచుర్యం చేయడానికి, మరింత పెంపొందించేందుకు దేవాలయానికి ఈ వెండి కవచం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ సభ్యులు దంతులూరి నరసింహరాజు, దాట్ల బుచ్చిబాబు దంతులూరి వంశీ పలువురు క్షత్రియ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.