Sunday, August 3, 2025
Sunday, August 3, 2025

కొమానపల్లి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ దాట్ల దాట్ల కలెక్టర్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ముమ్మిడివరం నియోజకవర్గం

రైతు సంక్షేమమే పరమావధిగా ఆధునిక సాంకేతికతతో పెట్టుబడి ఖర్చును తగ్గించేం దుకు డ్రోన్ టెక్నాలజీని ప్రభు త్వం తీసుకుని వచ్చిందని దీని ద్వారా నానాటికి తగ్గిపోతున్న వ్యవసాయకూలీల సేవలకు ప్రత్యామ్నాయంగా ఈ డ్రోన్ టెక్నాలజీ దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు.శనివారం మండల పరిధి లోని అన్నంపల్లి గ్రామంలో జిల్లాస్థాయి లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి దశ నిధుల విడుదల కార్యక్ర మాన్ని స్థానిక శాసనసభ్యు ల తో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రతిష్టా త్మకమైన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు శ్రీకారం చుట్టి మొదటి దశ గా అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం పిఎం కిసాన్ కింద రూ 2వేలు వెరసి రూ 7 వేలను 2025-26 వ్యవసాయ సీజన్ కి సంబం ధించి తొలివిడతగా ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో జమ చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడి ఖర్చులను తగ్గించి సాగును లాభసాటిగా మార్చేందుకు డ్రోన్ టెక్నాలజీతో విత్తనాలు వేద జల్లుట, నానో ఎరువులు నాట్లు వేయడం, సస్యరక్షణ విధానం లో క్రిమి కీటకాలు కల్పిస్తున్న నష్టాన్ని అంచనా వేసి వాటి నివారణ కొరకు క్రిమిసంహారక మందు లను పిచికారి విధా నాలను ఎంతో చాక చక్యంగా కూలీలు ప్రమేయం లేకుండా డ్రోన్ విధానం ఉపకరిస్తుంద న్నారు జిల్లాలో మూడు డివిజ న్లో 10 ఎకరాలు చొప్పున డ్రోన్ టెక్నాలజీ తో సాగు విధా నాల ను చేపట్టి ఆచరణ కై అధ్య యనాలు జరుగు తున్నాయ న్నారు ఈ విధానం విజయవం తం అయితే జిల్లా వ్యాప్తంగా అమలుకు చర్యలు గైకొంటా మన్నారు ఇప్పటికీ స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొం దించే దిశగా త్రిబుల్ ఐటీ కర్నూ లు వారి ద్వారా ఎస్ హెచ్ జి మహిళలకు డ్రోన్ ఆపరేటింగ్ విధానాలపై శిక్షణా కార్యక్రమా లు పూర్తి చేశామన్నారు.సాగులో 50 శాతం పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు డ్రోన్ టెక్నా లజీ లో అవకాశం ఉందన్నారు. రైతులు అధిక దిగుబడులను ఇచ్చే హైబ్రిడ్ జాతి వరి వంగ డాలను, పంట చేతికి అందే వరకు నిలబడి ఉండి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు నరేగా అనుసంధా నంతో అభివృద్ధి చేసి కాలువ డ్రైనేజీ గట్లను అభివృద్ధి చేసి రైతులకు మేలు జాతి కూర గాయలు ఆకుకూరలు పండ్ల మొక్కలు సాగులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామని రైతు సేవా కేంద్రాలలో రైతులకు ఈ సాగుపై అవగాహన పెంపొందిం చాలన్నారు జిల్లాలో సబ్సిడీతో అందించేందుకు 40 డ్రోన్లు మంజూరయ్యాయన్నారు .రైతు సేవా కేంద్రాల వారీగా అర్హుల జాబితా రూపొందించి ఈకే చైన్ ప్రక్రియను పూర్తి చేసి కోన సీమ జిల్లా వ్యాప్తంగా 1,34,439 మంది రైతులకు రూ.91. 10 కోట్లు జమ చేయడం జరిగిం దన్నారు. వీరిలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రూ 5 వేలు చొప్పున 1,34,439 మంది రైతులకు రూ 67.22 కోట్లు, ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద రూ.2 వేలు చొప్పున 1,19, 418 మంది రైతులకు రూ. 23.88 కోట్ల మేర చెల్లించినట్లు వెరసి రూ 91.10 కోట్లు చెల్లించి నట్లు తెలిపారు, ప్రస్తుతం ఖరీఫ్ సాగుతున్న నేపధ్యం లో వీరికి సీసీఆర్సీ కార్డుల ను జారీ ప్రక్రియ కొనసాగు తోoదని. జిల్లా వ్యాప్తంగా 75 వేల కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా నిర్ణయిం చారన్నారు. సుమారు 5 వేల మంది ఎస్సీ, బీసీ కౌలు రైతులకు అన్నదాత సుఖీ భవ పథకంలో పెట్టుబడి సాయం అందిందన్నారు. పథకంపై సందేహాల నివృత్తికి ప్రభుత్వం 155251 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటు లోనికి తెచ్చిం దన్నారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీ భవ పథకం వర్తిస్తుందన్నా రు.స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బ రాజు ప్రసం గిస్తూ నియోజక వర్గoలోరూ 30 కోట్ల మేర సిసి రోడ్లు డ్రైన్లు నిర్మించేందుకు నిధులు కేటాయించడం జరిగిం దన్నారు . జై జవాన్ జై కిసాన్ అన్న నానుడి ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు ప్రజా ఆకాంక్షల మేరకు సుపరిపాలన అందిస్తున్నాయన్నారు నీటి సంఘాలు పునరుద్ధరించి కాలువ చిట్ట చివరి ఆయకట్టు వరకు సమృద్ధిగా సాగునీరు అందిస్తున్నామన్నారు రైతాం గాన్ని అన్ని విధాల పెద్ద ఎత్తున ఆదు కోవడం జరుగుతుందన్నా రు. సాగునీరు, ఎరువుల కొరత లేకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు అర్హు లైన ప్రతి రైతుకూ అన్నదాత సుఖీ భవ పథకం లబ్ధి అం దించాలని, రైతులకు చేయూత నివ్వడం భారం కాదనీ బాధ్యత ని ప్రభుత్వం భావించి నిధులు విడుదల చేస్టోoదన్నారు. రైతులకు నిధులే కాదు. సాగుకు నీరు సరఫరా చేయడం జరుగుతోoదన్నారు.ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు అందిస్తామన్న హామీని అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ తో నెరవేర్చినట్లయిం దన్నారు. అన్నదాత సుఖీ భవ – పీఎం కిసాన్ పథకాల ను సంయుక్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింద న్నారు. త ద్వారా ఏడాదికి రూ. 20 వేలను రైతుల ఖాతాల్లో జమ చేయను న్నదన్నారు ఇందులో కేంద్రం వాటా రూ. 6 వేలు కాగా, రాష్ట్రం వాటా రూ. 14 వేలు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథ కం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 6 వేలను మూడు విడతలుగా రూ. 2 వేల చొప్పున రైతుల ఖాతా కు జమ చేస్తుందన్నారు. ఆ సమయంలో అన్నదాత సుఖీభవ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయ నుందన్నారు అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ పథకం కింద తొలి విడతలో రూ.7 వేలు కాగా దీనిలో కేంద్రం వాటా రూ.2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు, చెల్లిస్తుందని,రెండో విడత రానున్న అక్టోబర్లో అదేవి ధంగా కేంద్రం 5 వేలు రా ష్ట్రం 2 వేలు వెరసి మరో రూ. 7 వేలు, జమ చేయ డంతో పాటు మూడో విడ త రానున్న జనవరిలో అన్నదాత సుఖీభవ కింద రూ 4వేలు. పీఎం కిసాన్ కింద మరోరూ 2 వేలు ఇలా ఏడాది వ్యవధిలో రైతుల ఖాతాల్లో మొత్తంగా రూ. 20 వేలు జమ చేయను న్నారన్నారు ఈ పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలో రైతాంగానికి సుమారుగా రూ 16 కోట్ల, 42 లక్షల 76వేల చెక్కును రైతులకు పంపిణీ చేశారు ఈ కార్యక్ర మంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి మాజీ శాసన సభ్యులు చెల్లి వివేకానం ద, జిల్లా వ్యవ సాయ అధికారిబోసు బాబు,డ్వామా పిడి మధు సూదన్, సొసైటీ అధ్యక్షులు పి నారాయణ రావు సర్పంచ్ కాశీ ఇందిరా రాష్ట్ర వినియోగదారుల కమిటీ సభ్యులు ఎన్ నాగేశ్వర రావు జి సాయి ఏఎంసీ చైర్మన్ భాగ్యశ్రీ ఏ డి ఏ గౌతం రజక కార్పొరేషన్ చైర్మన్ ధర్మారావు ఎంపీపీ కే గంగాధర్ రావు నీటి సం ఘం అధ్యక్షులు జయశ్రీ జడ్పిటిసిలు, శివశంకర రావు శివ నాగేశ్వరరావు తాసిల్దార్ సుభాష్, డి సి ఓ రాధాకృష్ణ సొసైటీ డైరెక్టర్లు పట్టాభి రామ య్య, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo