టోర్నమెంట్లో 34 టీంలు పాల్గొనగా జగ్గంపేట టీం విన్నర్స్ గా, గుర్రప్పాలెం టీం రన్నర్స్ గా
విన్నర్స్ గా నిలిచిన జగ్గంపేట టీంకు షీల్డ్ తో పాటు 25 వేల 5 వందల 55 రూపాయల నగదు బహుమతి
కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఈనెల 12వ తేదీన ప్రారంభమైన కోరాడ సాయిరాం శ్రీనివాస్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. ఈ యొక్క టోర్నమెంట్లో 34 టీంలు పాల్గొనగా జగ్గంపేట టీం విన్నర్స్ గా, గుర్రప్పాలెం టీం రన్నర్స్ గా నిలిచారు..ఈ సందర్భంగా గుర్రంపాలెం రోడ్డులోని బాలాజీ రైస్ మిల్ ఎదురుగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రాంగణం వద్ద విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట టిడిపి మండల అధ్యక్షులు మారిశెట్టి భద్రం హాజరయ్యారు.క్రికెట్ పై ఎంతో మక్కువతో ఉండే జగ్గంపేటకు చెందిన యువకుడు ఇటీవల మృతి చెందడంతో ఆ యువకుడు తండ్రి కోరాడ సుబ్బారావు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆధ్వర్యంలో కీర్తిశేషులు కోరాడ సాయిరాం శ్రీనివాస్ (గిల్) పేరుతో నిర్వహించిన ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా సాయిరాం శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం అతిధుల చేతుల మీదగా విన్నర్స్ గా నిలిచిన జగ్గంపేట టీంకు షీల్డ్ తో పాటు 25 వేల 5 వందల 55 రూపాయల నగదు బహుమతి అందజేశారు. అదేవిధంగా రన్నర్స్ గా నిలిచిన గుర్రపు పాలెం టీంకు 15 వేల 555 రూపాయల నగదు తో పాటు షీల్డ్ ను అందజేశారు. 3వ ప్రైజ్ మనీ ఐదువేల రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కొండ్రోతు శ్రీను, కొండ్రోతు పైడియ, ప్రేమ స్వరూప్ బుజ్జి, ఆర్గనైజింగ్ టీం ఆలీషా, కిరణ్, పీలా మణికంఠ, జాన్, పప్పీ, రాజు తదితరులు పాల్గొన్నారు.