Monday, August 4, 2025
Monday, August 4, 2025

కాపవరంలో టీచర్ నాగలక్ష్మి కి ఘన సన్మానం 

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

కాపవరంలో టీచర్ నాగలక్ష్మి కి ఘన సన్మానం

విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం

కాపవరంలో టీచర్ నాగలక్ష్మి కి ఘన సన్మానం

 

రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-కాపవరం గ్రామంలో హైస్కూల్ 8 సవంత్సరాలు పనిచేసిన నందూరి నాగలక్ష్మి బదిలీపై వేళ్తున్న సందర్బంగా అభినందన సభ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆమె సేవలకు గ్రామ ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీ రెడ్నం సతీష్, సర్పంచ్ యనమదల మంగాదేవి,విద్యా కమిటీ చైర్మన్ గీసాల వీర వెంకట రామ్ ప్రసాద్,మాజీ విద్యా కమిటీ చైర్మన్ మత్తి లక్ష్మీ మణిమాల మరియు హై స్కూలు ఉపాధ్యాయులు నాగలక్ష్మి దంపతులునీ ఘనంగా సత్కరించారు. ఈ సభకి అధ్యక్షత ప్రధానోపాద్యాలు ముమ్ముడి సత్యనారాయణ వ్యవహరించారు. ఎంపీటీసీ రెడ్నం సతీష్ మాట్లాడుతూ 6 సవంత్సరాలు ప్రధానోపాధ్యాయులు గా పనిచేసిన సందర్భంలో ప్రాథమికోన్నత స్కూల్ గా ఉన్న స్కూలుని హైస్కూలుగా రూపాంతరం చెందటంలో ఆమె తెగువ ఎనలేనిదన్నారు.అదే సమయంలో నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ చాలా ఉన్నతంగా అభివృద్ధి చేశారని. ట్రాన్స్ఫర్ మీద వెళుతున్న నాగలక్ష్మి మాట్లాడుతూ ఎన్ని స్కూల్ లో పనిచేసిన ఈ కాపవరం స్కూల్లో పనిచేసిన అనుభూతి ఎన్నటికీ మరువలేనిదిగా గుర్తుండి పోతుందని. ఇక్కడ గ్రామస్థులు, విద్యార్థులు ఎంతో ఆప్యాయత అనురాగాలు చూపించే వారని తెలియజేశారు.అదే విధంగా రెండు సవంత్సరాలు ఉపాధ్యాయులు పనిచేసిన పోతంశెట్టి మధుమోహన్ గంగవరం మండలం మసకపల్లి ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా వారిని కూడా సత్కరించడం జరిగినది. ఈ రోజుల్లో పోటీ ప్రపంచంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఈయన పిల్లలు ఇద్దరిని ఇదే స్కూల్లో చదివించడం ఆయన విలువలకు ఆదర్శనీయుడని ప్రధానోపాధ్యాయులు ముమ్మిడి సత్యనారాయణ తెలియజేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo