Monday, August 4, 2025
Monday, August 4, 2025

ఆక్రమణలు, కబ్జా లను ఎమ్మెల్యే వేగుళ్ళ పెంచి పోషిస్తున్నారు….

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

మద్యం ఏరులై పారుతుంది…

మేమందరం జగన్ ఆదేశాలతో ముందుకు సాగుతాం…

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం…

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

మండపేట లో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆక్రమణలు, భూ కబ్జా లకు ప్రోత్సాహం అందిస్తున్నారని మండపేట నియోజకవర్గ వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. విజయలక్ష్మి నగర్ లోని వైసీపీ కార్యాలయం లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెల్ట్ షాపులు ద్వారా నియోజకవర్గం లో మద్యం ఏరులై పారుతుందన్నారు. తాము ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీస్తే డొంక తిరుగుడు సమాధానం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. సత్యశ్రీ రోడ్ లో మునిసిపల్ వాటర్ వర్క్స్ కు చెందిన రూ 4 కోట్లు విలువైన 18 సెంట్లు ఆక్రమణ కు గురైతే ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తను గత కొన్ని కౌన్సిల్ సమావేశం లో ఇదే అంశాన్ని లేవనెత్తినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మునిసిపల్ స్తలం సరిహద్దు లో ఉన్న వ్యక్తి 18 సెంట్లు ఆక్రమించి గోడ నిర్మాణం చేశారని తమ ప్రభుత్వం అధికారం లో ఉండగా అన్యాక్రాంతం అయిన భూమి స్వాధీనం చేసుకుని గోడ తొలగించామన్నారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే తిరిగి గోడ నిర్మించారని ఆరోపించారు. దీనిపై కౌన్సిల్ లో తను ప్రస్తావన తేగా ఎమ్మెల్యే తను కలగ చేసుకున్న అంశంలో మాట్లాడానని చెప్పారని ఇది ఆక్రమణ దారులకు మద్దతు పలకడం కాదా అంటూ ప్రశ్నించారు. తమ పార్టీ కి చెందిన వ్యక్తి కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అని నిలదీశారు. దీనిపై కమిషనర్ ఎమ్మెల్యే వత్తిడి తో చేతులు ఎత్తేశారని అన్నారు. పవిత్రమైన మున్సిపల్  కార్యాలయం కు కూత వేటు దూరం లో మద్యం షాపుల జాతర ఎమ్మెల్యే కు కనబడడం లేదా అని ప్రశ్నించారు. మద్యం డోర్ డెలివరీ అవుతుందన్నారు. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు వెలిశాయనీ చెప్పారు. ప్రభుత్వ హామీలపై నిలదీస్తే డొంక తిరుగుడు సమాధానం ఇవ్వడం తగదన్నారు. నిరుద్యోగ భృతి ఏమైందన్నారు. యువత కు ఒక్కో నెల కు 3000 వేలు చొప్పున ఏడాది కి 36 వేలు చెల్లించాల్సి ఉందని ఎపుడు ఇస్తారని ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి పధకం కింద ఒక్క రూపాయి కూడా జమ కాలేదన్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఇస్తానని ఒకటే ఇచ్చి గ్యాస్ కొడుతున్నారని అది మోసం కాదా అన్నారు. ఇలా ప్రభుత్వ పథకాలు సంపూర్ణం గా అమలు చేయడం లేదని పేర్కొన్నారు. జగన్ గారు ఇచ్చిన అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనముగా నామకరణం చేసుకొని ఆ పథకానికే తూట్లు పొడిచిన ఘనత మీదేనని తల్లుల ఖాతాలో ఇంకా సొమ్ము జమ కానివారు ఉన్నారన్నారు. శాసనసభ్యులు మాట్లాడుతూ పార్టీలో నాయకత్వం కోసం కుమ్ములాడుకుంటున్నారని తెగ సంబరపడిపోతున్నారని అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం కోసం పోరాటం లేదని అంతా ఒకే తాటిపై ఉందని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల ప్రకారం పార్టీలో అందరూ ముందుకు సాగుతామని తమరు ఊహించినవన్నీ జరగవని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏకతాటిపై పని చేస్తామని తోట తెలిపారు. ఈ సమావేశంలో వైసిపి నేతలు వేగుళ్ల పట్టాభి రామయ్య, కర్రి పాపారాయుడు, మండపేట నియోజకవర్గం పరిశీలకులు కటకంశెట్టి ఆదిత్య కుమార్, ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్, అర్బన్ మరియు రూరల్ పార్టీ అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్, అడబాల బాబ్జి, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి సిరిపురపు శ్రీను, కుడిపూడి రాంబాబు, జిల్లా పార్టీ సెక్రటరీ టేకిమూడి శ్రీను, పలివెల సుధాకర్, సాధనాల శివ భగవాన్, డి. మహేష్, రామోజీ కృష్ణ, పలుకురి వెంకన్న బాబు, కోనాలు బోస్ తదితరులు పాల్గొన్నారు.

 

 

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo