బాలుడిని ఢీకొట్టిన ఆటో
కాట్రేనికోన మండలం విశ్వం వాయిస్ న్యూస్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పరిధిలో
రోడ్డు ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు
పాఠశాల ముగిసిన అనంతరం ఇంటికి వెళుతున్న బాలుడిని వెనక వైపు నుంచి వచ్చి ఆటో ఢీ కొట్టింది. కాట్రేనికోన కు చెందిన వనసర్ల లక్ష్మణ్ (7) చింతల మె రక పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూలు ముగిసిన తర్వాత పక్కనే ఉన్న ఇంటికి వెళుతుండగా అమలాపురం నుండి పల్లంకురు వైపు వెళుతున్న ఆటో వెనుక నుండి ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ సంఘటనలో బాలుడు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. హుటా హుటిన అమలాపురంలోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.