సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
పది గంటల పని విధానాన్ని ఉపసంహరించుకోవాలనీ , ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. రవాణా రంగ కార్మికుల పట్ల శాపంగా మారిన బిఎన్ఎస్ చట్టాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. నిర్మాణ రంగ కార్మికుల సమ్మె చట్టం 1996ను వలస కార్మికుల సంక్షేమ చట్టం 1970 నీ పటిష్టంగా అమలు చేయాలి. ఎల్ఐసి పాలసీపై జిఎస్టి ని రద్దు చేయాలి , ఎల్ఐసి ఏజెంట్లకు భద్రత కల్పించాలనీ పలు డిమాండ్లు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ఎటపాక వైటిసి నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ సుబ్బారావుకు అందించారు. ఈ ర్యాలీలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, వీఆర్ఏలు, భవన నిర్మాణ కార్మికులు, పెయింటర్స్ , ఆటో యూనియన్ , పోస్టల్ యూనియన్ , ఎల్ఐసి ఏజెంట్స్ యూనియన్లు భాగస్వాములు అయ్యాయనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు , జిల్లా కమిటీ సభ్యులు ఐవి , సిఐటియు మండల అధ్యక్షులు జి హరనాథ్ , సిఐటియు నాయకులు డేగల మాధవరావు , తోట శ్రీను , సిపిఎం నాయకులు పులుసు బాలకృష్ణ , ఆకిశెట్టి రాము , పొడియం రత్తమ్మ , సోయం వీరమ్మ , ఐద్వా జిల్లా కార్యదర్శి ఐ పద్మ , తదితరులు పాల్గొన్నారు.