Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ

విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం

 

వేలాది పేద విద్యార్థుల భవిష్యత్తు నాశనం

 

పీ.డి.ఎస్.యూ ఆధ్వర్యం తల్లిదండ్రులుతో ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన

 

ధర్నా ఏ.ఓ ఝాన్సీ కి వినతి పత్రం

 

రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద పిడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లితండ్రులుతో ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీ డీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ మాట్లాడుతూ రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఆర్టీఈ 12(1)(సి)) కింద ప్రభుత్వ ఖర్చుతో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులపై ప్రభుత్వం ఘోరమైన నిర్లక్ష్యం చూపుతోందన్నారు.గత ప్రభుత్వం,నేడు కూటమి ప్రభుత్వం తగిన నిధులు విడుదల చేయకపోవడం వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు అవమానాలను ఎదుర్కొంటున్నారు. రామచంద్రపురం, మండపేట,రాయవరం, గంగవరం,కాజులూరు, కపిలేశ్వరపురం మండలల్లో లక్షల్లో ఫీజులు బకాయిలుగా ఉండటంతో స్కూళ్లు విద్యార్థులను తరచూ తరగతుల నుంచి బయటకు పంపిస్తున్నాయి.విద్యే తమకు జీవిత సాధనమని ఆశతో ఆర్టీఈ ద్వారా చేరిన పేదల పిల్లలు ఇప్పుడు నిరాశలో మునిగిపోతున్నారు.

 

ప్రైవేట్ స్కూళ్ల దౌర్జన్యాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం చేతులు పైకి ఎత్తేచింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 97 వేల మంది విద్యార్థులు ఈ పథకానికి లోబడి ఉన్నా,ట్యూషన్ ఫీజులు ప్రతి విద్యార్ధికి 8 వేల రూపాయలు బకాయిలు విడుదల చేయలేదు అన్నారు.ఒకే స్కూల్‌లోనే రూ.6 నుంచి రూ.8 వేల వరకు పెండింగ్ బిల్లులు ఉన్నాయంటే, రాష్ట్ర స్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అంతే కాకుండా కూటమి తెలుగు దేశం ప్రభుత్వం ఆర్టీఈ 12(1)(సి) ద్వారా కార్పొరేట్,ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లు పొందిన ఎస్.సి,ఎస్.టీ, బిసి,ఒసి,మైనారిటీ, వికలాంగులు,అనాధ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని నేరుగా స్కూల్ వారి బ్యాంకు ఖాతాకు ఎనిమిది వేల రూపాయలు జమా చేస్తామని కూటమి ప్రభుత్వం జిఓ 9ను తెచ్చిందని,తల్లికి వందనం పథకాన్ని ఉచిత సీట్లు పొందిన విద్యార్థులకు హోల్డ్ లో పెట్టింది. కార్పొరేట్,ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రులను ముక్కు పిండి వసూలు వసూలు చేస్తున్నారు.యాక్టివిటీస్, క్యాపిటేషన్,ఇతర ఫీజులు కట్టాలని లేనిపక్షంలో స్కూల్ కి రావద్దని, ఆటల్లో ఉండరాదని, మధ్యాహ్నం రెండు గంటలు లోపు స్కూల్ నుండి తీసుకుని పోవాలని తల్లి దండ్రులు మీద ఒత్తిడి చేస్తున్నారరన్నారు.ఆర్టీఈ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు మీద వివక్షత చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఆర్టీఈ కింద చదువుతున్న విద్యార్థుల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని,విద్యార్థులపై జోక్యం చేసుకుంటున్న ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు.పేద విద్యార్థుల హక్కులను కాలరాసే ప్రభుత్వ వైఖరి తక్షణమే మారాలని డిమాండ్ చేశారు. రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా తూర్పు గోదావరి జిల్లా నాయకులు పీ.వై ఎల్ వి.భీమా శంకరం, అంబటి కృష్ణ,కె.శివ,వి. నాగరాజు,కె.నవీన్,కె.రవి, కె.సురేష్,ఎం.సూరిబాబు. ఎం.నానాజీ,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo