డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామం రెడ్డెప్పవారిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి,స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత అంబేద్కర్ దని కొనియాడారు.ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేసి వాటిని సాకారం చేసుకోవడమే అంబేద్కర్ కు మనమిచ్చే గౌరవం అని ఎంపీ హరీష్ బాలయోగి అన్నారు.

