తండ్రిని కోల్పోయి విషాదంలో ఉన్న మాజీమంత్రి కురసాల కన్నబాబును రాష్ట్ర సభార్డినేట్ కమిటీ చైర్మన్, మండపేట నియోజకవర్గ వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గురువారం పరామర్శించారు. ఎమ్మెల్సీ అనంతబాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడులు కలిసి కన్నబాబు నివాసానికి వెళ్లి దివంగత సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తండ్రి మరణం పట్ల విచారం వ్యక్తం చేసి కన్నబాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

