మండపేట 11వ వార్డ్ లో రేషన్ షాప్ నంబర్ – 6 పరిధిలో ఉన్న రేషన్ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన క్రొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.11వ వార్డ్ కౌన్సిలర్ కొవ్వాడ బేబి అప్పన్న బాబు పంపిణీ చేశారు. వి ఆర్ ఓ రేషన్ డీలర్, కూటమి నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు.ఈ డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు రావడంతో రేషన్ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డ్ టీడీపీ అధ్యక్షులు ఆళ్ల వీరబాబు, బి ఎల్ ఏ జనిపల్లి సూరిబాబు, కో బి ఎల్ ఏ వెల్ల నాగేశ్వరరావు, కొల్లాటి ప్రసాద్, పిట్టా రామన్న, బెందల వెంకన్న, రావాడి నాని, రొమ్మలపూడి అచ్యతరామయ్య , పిట్టా అర్జున్, నూకతట్టు కిషోర్, దాసరి సుదర్శనరావు, పెనుగొండ ధర్మయ్య, బల్ల సత్యనారాయణ, పోలిపల్లి జోషి , వాసా చిన్నోడు, కట్టుమేను సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.