కార్పొరేట్ బ్యాంకులతో పోటీపడుతూ ప్రజలకు ఉత్తమ బ్యాంకింగ్ సేవలను – మద్దిపట్ల శివరామకృష్ణ
కార్పొరేట్ బ్యాంకులతో పోటీపడుతూ ప్రజలకు ఉత్తమ బ్యాంకింగ్ సేవలను అందించడంలో, బ్యాంకు అభివృద్ధి పదంలో నడిపించడంలో కార్యవర్గం బ్యాంకు సిబ్బంది సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ విశిష్ట సేవ పురస్కారం అందుకోవడం జరిగిందని కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ సొసైటీ అధ్యక్షులు మద్దిపట్ల శివరామకృష్ణ అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన సేవ పురస్కార అవార్డులలో కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఉత్తమ విశిష్ట సేవా పురస్కారం అందుకున్న సందర్భంగా శనివారం కొవ్వూరు పట్టణంలోని కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ నందు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దిపట్ల శివరామకృష్ణ మాట్లాడుతూ 2001 సంవత్సరం లో నష్టాల బాటలో ఉన్న కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 2002వ సంవత్సరంలో కార్యవర్గ బాధ్యతలను చేపట్టి ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ, అతి తక్కువ వడ్డీతో వ్యవసాయ రుణాలను , బంగారు ఆభరణాలపై రుణాలను, గృహనిర్మాణ రుణాలను, విద్యా రుణాలను అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ బ్యాంకు లాభాల బాటలో నడిపించడంలో కార్యవర్గం సిబ్బంది సహకారం గణనీయమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తమ విశిష్ట సేవా పురస్కారాలను అందుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోపరేట్ వర్కింగ్ బ్యాంక్ సొసైటీ కార్యదర్శి వి ఎస్ శ్రీనివాస్, డైరెక్టర్లు పాలింపాటి చినబాబు చౌదరి, దాయన రామకృష్ణ, కుప్పాల ప్రసాదు రావు తదితరులు పాల్గొన్నారు.