భారతీయులుగా పుట్టినందుకు గర్వపడాలి – మునిసిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి
కులం ఏదైనా మతం ఏదైనా మనమంతా భారతీయులమని భారతీయుడిగా పుట్టినందుకు గర్వించాలని కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి అన్నారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం కొవ్వూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు 100 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని తీసుకుని వందేమాతరం భారత్ మాతాకు జై అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల త్యాగాల ఫలితం మనం అనుభవిస్తున్న భారత దేశ స్వాతంత్రం అని అన్నారు. ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ముందుకు సాగుతుందని భారతీయుడిగా పుట్టినందుకు మనం గర్వించాలన్నారు. భారతీయులందరూ దేశం పట్ల భక్తిని గౌరవాన్ని కలిగి ఉన్నారని అన్నారు భావితరాలకు భారతదేశం త్రివర్ణ పతాకం ఆవశ్యకత తెలిపేందుకు హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఆగస్టు 15 వరకు ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాక జెండా ఎగురు వెయ్యాలని అన్నారు
ఈ కార్యక్రమంలో కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ గ్రంధి సందీప్ కుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జొన్నకూటి సునీత , 9వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మురళీకృష్ణ, బాబు జగజీవన్ రామ్ విశ్రాంత ఉద్యోగ సంఘం అధ్యక్షులు పెనుమాక జయరాజు,ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఏబీఎన్ అండ్ పి ఆర్ ఆర్ కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

