14 October 2025
Tuesday, October 14, 2025

కొవ్వూరు లో సెప్టెంబర్ 6వ తేదీన ఆశ్రయ ఫౌండేషన్ ప్రారంభం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పధంతోనే ఈ ఆశ్రయ ఫౌండేషన్ – పల్లవి

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు చివరి దశలో ఆశ్రయ ఫౌండేషన్ ఆసరాగా నిలుస్తుందని ఆశ్రయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ కుమార్, పల్లవి అన్నారు. క్యాన్సర్ వ్యాధితో మరణానికి చెరువులో ఉన్న వ్యాధిగ్రస్తులకు అండగా నిలవాలని సేవా తత్పరతతో 2019 సంవత్సరంలో కొవ్వూరు పట్టణం ఏర్పాటు చేసిన ఆశ్రయ ఫౌండేషన్, దాతల సహకారంతో నందమూరు వెళ్లే దారిలో నూతన భవనాన్ని ఏర్పాటు చేసి సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభిస్తున్న సందర్భంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ కుమార్, పల్లవి లు మాట్లాడుతూ 2011 వ సంవత్సరంలో వాలంటీర్ గా పనిచేస్తూ ఆస్ట్రిక్లో ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందని వ్యాధిగ్రస్తులతో ఏ విధంగా మాట్లాడాలి వారిని ఏ విధంగా చేరువ చేసుకోవాలి అనే విషయంలో శిక్షణ తీసుకోవడం జరిగిందన్నారు . క్యాన్సర్ మరియు బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా పిల్లలకు సోకుతుందని ఎక్కువ శాతం క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు గోదావరి జిల్లాలోనే ఉండడం జరుగుతున్న నేపథ్యంలో 2019 సంవత్సరంలో కొవ్వూరు పట్టణంలో మెయిన్ రోడ్ నందు ఆశ్రయ ఫౌండేషన్ను ప్రారంభించడం జరిగిందన్నారు. తణుకులో పుట్టిన నేను సేవ చేయాలి అనే లక్ష్యం తో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశామన్నారు. క్యాన్సర్ నాలుగో స్టేజి లో ఉన్న రోగికి చివరి దశలో తగిన రక్షణ కల్పిస్తూ అనుభవజ్ఞులైన వైద్యులచే చికిత్స ఇవ్వడం జరుగుతుందన్నారు, చివరి దశలో ఉన్న క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఆశ్రయం కల్పించడంతోపాటు వివిధ వ్యాధుల సోకి ప్రాణాలు కోల్పోవడానికి చివరి దశలో వారికి ఆసరా కల్పిస్తూ మరణాన్ని సంతోషంగా స్వీకరించే విధంగా వారికి ఆశ్రయ ఫౌండేషన్ ఆసరాగా నిలుస్తుంది అన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo