- జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కు ఘన స్వాగతం పలకాలి – ఎమ్మెల్సీ సోము వీర్రాజు
సారథ్యం అనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా విచ్చేస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘన స్వాగతాన్ని పలకాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు కోరారు. మంగళవారం కొవ్వూరు పట్టణంలోని గౌతమి నగర్ నందు 9వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మురళీకృష్ణ నివాసం వద్ద కొవ్వూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా తయారు చేయాలనే సంకల్పంలో రాష్ట్ర అధ్యక్షులు తూర్పుగోదావరి జిల్లా పర్యటన చేయడం జరుగుతుందన్నారు గ్రామ గ్రామాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజా శ్రే యస్సు కొరకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లి భారతీయ జనతా పార్టీ ప్రజలకు మరింత చేరువు చేయాలన్నారు రాష్ట్ర అధ్యక్షుడు పర్యటనను విజయవంతం చేయడంలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బోడపాటి ముత్యాలరావు, పిల్లలమర్రి మురళీకృష్ణ, విజయభాస్కరరావు, కొవ్వూరు మండల బిజెపి అధ్యక్షులు డేగల సునీత, మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు తాడిమల్ల విజయ వాణి, గోపిశెట్టి శివకృష్ణ, కొండపల్లి రత్న సాయి, బెల్లంకొండ మణికంఠ తదితర భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.