డ్రైనేజీ పూడికలు సర్రిగా తీయకపోవడం వాళ్ళ డ్రైనేజీ నీళ్లు రోడ్డు మీదకు రావడంతో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. కొవ్వూరు పట్టణం రెండో వార్డ్ శ్రీరామ్ కాలనీలో శనివారం తెల్లవారుజామున కురిసిన చిన్నపాటి వర్షానికి రోడ్లు బురదమయం అయ్యాయి. కనీసం వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మున్సిపాలిటీ వారు తీసుకోవడం లేదని, వార్డులలోని శానిటేషన్ సరిగ్గా చేయడం లేదని, దీని వలన ప్రజలు అంటువ్యాధులకు గురవుతారని కాలనీవాసులు వాపోయారు.

