సమాజంలో అవసరతలను గుర్తించి మరిన్ని సేవలను అందించడంలో లైన్స్ క్లబ్ ముందుంటుంది – లైన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ యనమదల సుబ్రహ్మణ్యం
సమాజంలో అవసరతలను గుర్తించి మరిన్ని సేవలను అందించడంలో లైన్స్ క్లబ్ ముందుంటుందని లైన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ యనమదల సుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం కొవ్వూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణమండపం నందు జిల్లా గవర్నర్ జోన్ సలహా సమావేశం నిర్వహించారు. జోనల్ పరిధిలోని కొవ్వూరు దేవరపల్లి తాళ్లపూడి లైన్స్ క్లబ్ అధ్యక్షులు పాల్గొన్న ఈ సమావేశంలో జోన్ చైర్పర్సన్ ఎనమదల సుబ్రమణ్యం మాట్లాడుతూ లైన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సమాజంలో వివిధ సేవలను అందించడం జరిగిందని పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించడం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు మరియు నేత్ర పరీక్షలు నిర్వహించడం ఉత్తమ విద్య కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా అవార్డులను అందించడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందరికి చేయడమే లక్ష్యంగా లైన్స్ క్లబ్ పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు లైన్స్ క్లబ్ అధ్యక్షులు పెనుమాక జయరాజు, దేవరపల్లి లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఎన్ రామరహిత, పాలకొల్లు లైన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు మద్దిపాటి ప్రకాశం, ఎల్సిఐడిసి యూత్ క్యాంప్స్ అండ్ ఎక్స్చేంజి చైర్పర్సన్ పాలెంపాటి చినబాబు చౌదరి, మారిన రామ్మూర్తి, దుగ్గిరాల సూర్యప్రకాష్ రావు, గోలి వెంకటరత్నం, బూరుపల్లి వెంకటేశ్వరరావు కలగర వెంకటరావు ఉప్పులూరి రామకృష్ణ నాలం శ్రీనివాసరావు తదితర లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు