ఎమ్మెల్యే వేగుళ్ళ…
ఆలయాల అభివృద్ధికి దేవస్తానం కమిటీ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మెన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావుఅన్నారు.
కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో శ్రీ కేశవ వెంకటేశ్వరస్వామి దేవస్దానం, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యే వేగుళ్ళ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. శ్రీ కేశవ వెంకటేశ్వరస్వామి వార్కి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఇ.ఒ ఎం.రాంబాబు రెడ్డి, నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. చైర్మన్ గా గొడవర్తి వెంకటలక్ష్మి, మెంబర్లుగా వి.సాయి అరుణ, జి.ఆదిలక్ష్మి, కె.కృష్ణవేణి, టి.రవి భాస్కర్, ఎన్.శ్రీనివాస్, జి.రామలక్ష్మి, పి.శ్రీనివాస్, సి.హెచ్.భాగ్యలక్ష్మి లు నియమితులయ్యారు. అనంతరం వాకతిప్ప పిఎసిఎస్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వాకతిప్ప పిఎసిఎస్ చైర్మన్ గా గొడవర్తి సత్యనారాయణ మూర్తి, మెంబర్లుగా వాసంశెట్టి నాగేశ్వరరావు, దాకారపు నాగేశ్వరరావు లు నియమితులయ్యారు. వీరితో సొసైటి సెక్రటరీ కరుటూరి నారాయణరావు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ గుడాల జయబాబు, మండల అధ్యక్షులు బలవరెడ్డి సత్తిబాబు, మాజీ అధ్యక్షులు ముత్యాల వెంకట్రావు, అల్లూరి రామకృష్ణ చౌదరి, నేమాని వెంకటేశ్వరరావు, నాగులచెరువు సర్పంచ్ వాసంశెట్టి సత్యనారాయణ, ఎపిటిసి కుంచె ప్రసన్న కుమార్, నెక్కంటి రాంజి, గొడవర్తి సత్యనారాయణమూర్తి, బలుసు శ్రీనివాస కుమార్, నెక్కంటి సత్యనారాయణమూర్తి, బలుసు వీరవెంకట సత్యనారాయణ చౌదరి, జాస్తి సుబ్బారావు, దాకారపు నాగేశ్వరరావు, అల్లూరి వినోద్ కుమార్, మేడిశెట్టి సత్యనారాయణ, గుబ్బల శ్రీనివాస్ పాల్గొన్నారు.