డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం ఎంపీడీవో కీర్తి స్పందన పాల్గొన్నారు. స్థానిక ఇందిరా కాలనీలో పలు కొత్త పింఛన్లను అర్హులకు ఆమె అందించారు. అధికారులు మండల వ్యాప్తంగా భరోసా పింఛన్లు అర్హుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ కార్యక్రమం చేపట్టారని, మండలంలో 156 క్రొత్త ఫించన్ల తో కలిపి10,031 మందికి పింఛన్లు అందించ వలసి ఉండగా శుక్రవారం 9,243 మందికి పింఛన్లు అందించామన్నారు, ఈ పింఛను నిమిత్తం రూ.4,28,66,500 లు విడదలవగా రూ.3,92,75,500 లు అర్హులకు ఫించన్లు గా అందించామని, గ్రామాల వారీగా పసలపూడి 1,2 సచివాలయాల పరిథిలో 1285, రాయవరం 1,2 సచివాలయాల పరిథిలో 1122, లొల్ల గ్రామంలో 188, సోమేశ్వరం 1,2 సచివాలయాల పరిథిలో 1153, వెంటూరు 1,2 సచివాలయాల పరిథిలో 829, చెల్లూరు1,2,3 సచివాలయాల పరిథిలో 1458, వెదురుపాక గ్రామంలో 791, నదురు బాధ గ్రామంలో 143, మాచవరం 1,2 సచివాలయాల పరిథిలో 1298, కూర్మాపురం గ్రామంలో 324, వెదురుపాక సావరం గ్రామంలో 428, కురకాలపల్లి గ్రామంలో 224 మందికి 92% కూటమి కార్యకర్తల సహకారంతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అధికారులు మండల వ్యాప్తంగా అర్హులకు ఇంటి వద్ద అందించారని ఎంపీడీవో కీర్తి స్పందన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయవరం గ్రామ సర్పంచ్ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి దాసరి సత్యనారాయణ, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు, అధికారులు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.