డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండల పరిధిలో గల వివిధ గ్రామాలకు చెందిన పలువురికి 156 కొత్త పెన్షన్లు మంజూరైనట్లు రాయవరం మండల ఎంపీడీవో కీర్తి స్పందన గురువారం ప్రకటన ద్వారా తెలిపారు. నూతనముగా మంజూరైన పింఛనులు భర్త మరణిస్తే భార్య కు వచ్చినవే అన్నారు. వీరందరికీ ప్రతీ నెల ఫించన్లు అందించనున్నారని ఆగష్టు నెలకు సంబంధించిన ఫించన్లు 1 వ తేదీ శుక్రవారం రూ.4000 చొప్పున పంపిణీ చేపడతామన్నారు. దీనితో మండల వ్యాప్తంగా మొత్తం పింఛన్లు 10,036 కాగా ఈ ఫించన్లు నిమిత్తం రూ.4,28,66,500 లు విడుదలైనట్లు ఎంపీడీవో ప్రకటన ద్వారా తెలిపారు