14 October 2025
Tuesday, October 14, 2025

మండపేట లో 49వ రాష్ట్ర స్ధాయి టెన్నికాయిట్ పోటీలు…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

క్రీడల్లో రాణించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు అని అంతేకాకుండా క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహద పడతాయని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇండోర్ స్టేడియం లో 49 వ రాష్ట్ర స్ధాయి టెన్నికాయిట్ చాంఫియన్ షిప్ పోటీలు నిర్వహించారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేగుళ్ళ ముఖ్య అతిధిగా పాల్గొని పోటీలు ప్రారంభించారు.చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్ధులు క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా అత్యున్నత శిఖరాలు చేరుకోవచ్చునన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సాధారణమేనని, ఓటమి గెలుపుకు నాంది కావాలి అని క్రీడాకారులకు సూచించారు. క్రీడల్లో రాణించి దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావలని కోరారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టెన్నికాయిట్ ఆటగాళ్లకు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కొద్దిసేపు ఎమ్మెల్యే టెన్నికాయిట్ ఆడి అందరిని అలరించారు. టెన్నికోయిట్ కోచ్ కుంచె రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo