హిందీ భాష అభివృద్ధికి కృషి…
హిందీ పండిట్ ఫర్జానాకు సత్కారం…
జాతీయ భాష హిందీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని బిజెపి సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ అన్నారు. మండపేట శ్రీ వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఆదివారం మహబూబ్ హిందీ అకాడమీ ఆధ్వర్యంలో హిందీ దివాస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మహబూబ్ హిందీ అకాడమీ చైర్మన్, హిందీ పండిట్ షేక్ ఫర్జానా బేగం అధ్యక్ష వహించారు. ముఖ్య అతిథిలు గా సీనియర్ బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ, ప్రభుత్వ పాఠశాల ఉపాద్యాయులు ఎల్ శ్రీనివాసరావు లు విచ్చేశారు. ఈ సందర్భంగా కోన సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడి విద్యార్థులు అందరికీ హిందీ ఎంతో అవసరమన్నారు. సాఫ్ట్ వేర్ రంగం లో ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల్లో ఉపాధి పొందుతున్న యువత చిన్నతనం నుండే ఇంగ్లీష్, తెలుగు తో బాటు హిందీ లో ప్రావీణ్యం సాధించాలని పేర్కొన్నారు. హిందీ భాష అభివృద్ధికి గత 17 ఏళ్లు గా కృషి చేస్తున్న హిందీ పండిట్ ఫర్జానా సేవలను కొనియాడారు. ఉపాద్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించే యూపీ ఎస్ సి తో బాటు ఇతర పోటీ పరీక్షలు అన్ని హిందీ లో ఉంటున్నాయని తప్పకుండా విద్యార్థులు హిందీ పై పట్టు సాధించాలని కోరారు. ఫర్జానా గత 14 ఏళ్లు గా హిందీ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఎందరో విద్యార్థులకు హిందీ లో తీర్చిదిద్దారని పేర్కొన్నారు. అనంతరం హిందీ భాషాభివృద్ధి కి కృషి చేస్తున్న ఫర్జానా ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఫర్జానా మాట్లాడుతూ తను హిందీ పండిట్ గా సుదీర్ఘకాలం మండపేట ఎం పి ఎస్ లో పనిచేశానని చెప్పారు. ప్రస్తుతం మండపేట సెయింట్ ఆన్స్ స్కూల్ లో పనిచేస్తున్నట్లు చెప్పారు. హిందీ భాషా దినోత్సవం ను ప్రతి సంవత్సరం సెప్టెంబరు 14న జరుపుకుంటారన్నారు. భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి, ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహద పడినందున గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారన్నారు. ఈ కార్యక్రమం లో హిందీ ఉపాద్యాయులు ముహమ్మద్ ఫాతిమా, షేక్ మహబూబ్ వున్నిసా , విద్యార్థులు పాల్గొన్నారు