మండపేట ఎస్ ఐ గా ఎన్ రాము….
మండపేట పట్టణానికి సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా ఎన్.రాము బదిలీ పై వచ్చారు. 2012 బ్యాచ్ కి చెందిన రాము మండపేటలో ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈయన మారేడుమిల్లి, కాకినాడ సి సి ఎస్, రాజమండ్రి మూడవ పట్టణ స్టేషన్ ఎస్.ఐ గా విధులు నిర్వహించారు. రావులపాలెం ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తూ మండపేటకు బదిలీ పై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పై దృష్టి సారించామని చెప్పారు. శాంతి భద్రత లు పరిరక్షణ కు కృషి చేస్తామని పేర్కొన్నారు.