మండపేట, ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం వైసిపి పరిశీలకులుగా అమలాపురం కు చెందిన చెల్లుబోయిన శ్రీనివాస్ ను పార్టీ నియమించింది.మండపేట ముమ్మిడివరం నియోజకవర్గాల సమన్వయ కర్త గా చెల్లుబోయిన శ్రీనివాస్ నియామకం పట్ల మండపేట సొసైటీ మాజీ అధ్యక్షులు పెంకే గంగాధర్ హర్షం వ్యక్తం చేశారు.అమలాపురం పట్టణానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు చెల్లుబోయిన శ్రీనివాస్ ను ముమ్మిడివరం, మండపేట నియోజకవర్గాల సమన్వయ కర్తగా నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. రీజనల్ కోఆర్డినేటర్, పార్లమెంట్ ఇన్చార్జి తో సమన్వయం చేసుకుంటూ శ్రీనివాస్ పనిచేస్తారని ఆయన తెలిపారు.శ్రీనివాస్ కు కీలక భాద్యతలు అప్పగించడం పట్ల మండపేట నియోజకవర్గ వైసిపి నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, పురపాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూకదుర్గరాణి, కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ (రెడ్డి రాజబాబు), రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, సొసైటీ మాజీ చైర్మన్ పెంకే గంగాధర్, వైసిపి టౌన్ ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్, రాష్ట్ర వైసిపి నాయకులు యాండ్ర ప్రభాకరరావు, జిల్లా నాయకులు టెకీముడి శ్రీను,తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

