మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ ఆదివారం మండపేట అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నామని జె ఏ సి కన్వీనర్ కామన ప్రభాకరరావు తెలిపారు. సత్య శ్రీ థియేటర్ వద్ద గల లయన్స్ క్లబ్ లో మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పై మంత్రివర్గ ఉపసంఘం నియమించిన నేపథ్యంలో తాజాగా జెఏసి సమావేశమై తదుపరి కార్యాచరణ పై చర్చించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మెన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, అన్ని పక్షాల, యూనియన్ ల ప్రతినిధులు హాజరు కానున్నారనీ తెలిపారు. ఈ సమావేశం లో ప్రజలు హాజరై తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.