Thursday, July 31, 2025
Thursday, July 31, 2025

మండపేటను తూర్పుగోదావరి లో విలీనం చేస్తా…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా…

జెఏసి సమావేశం లో ఎమ్మెల్యే వేగుళ్ళ…

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

మండపేట ప్రజల ఆకాంక్ష మేరకు మండపేట ను రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు కృషిచేస్తానని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ , మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు స్పష్టం చేశారు. తను ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మండపేట లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఆదివారం జెఏసి చైర్మన్ కామన ప్రభాకరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వేగుళ్ళ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపేట టౌన్, మండలం విలీనం చేసేందుకు ఇక్కడి ప్రజలు వంద శాతం సుముఖంగా ఉన్నారన్నారు. కాగా కపిలేశ్వరపురం, రాయవరం మండలాల్లో లోగడ విభిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు.ఆ రెండు మండలాలకు సంబంధించి మెజార్టీ ప్రజల కోరుకునే విధానం లో పనిచేస్తానని స్పష్టం చేశారు.ఆయా గ్రామాల్లో పంచాయతీ తీర్మానాలు ఇవ్వాలన్నారు. దీని ప్రకారం ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
తూర్పు గోదావరి
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo