Friday, August 8, 2025
🔔 9
Latest Notifications
Friday, August 8, 2025
🔔 9
Latest Notifications

మందకృష్ణ మాదిగ నిస్వార్థ సేవా ఫలితమే ఎస్సీ వర్గీకరణ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

రాయవరంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మందకృష్ణ మాదిగ స్ఫూర్తితో యువత కష్టపడాలి

రాయవరం గ్రామ సర్పంచ్ రామకృష్ణ, లంక చందు సూచన

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, . రాయవరం

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట నియోజకవర్గం,మండల కేంద్రమైన రాయవరంలో ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా కమిటీ సభ్యులు లంక చందు ఆద్వర్యంలో, గ్రామ సర్పంచ్ చందమల్ల రామకృష్ణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు, కార్యక్రమంలో తొలుత మాదిగ సామాజిక వర్గ పెద్దలు సాంప్రదాయ డప్పులతో అంబేద్కర్,బాబుజగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు, తదుపరి సభను ఏర్పాటు చేసి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపుతూ, మాదిగ జాతి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు మందకృష్ణ మాదిగ చేసిన కృషి గొప్పదని, ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ నిమిత్తం 30 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించారని,ఆ ఫలితం ఇప్పుడు తదుపరి తరాలు అనుభవించడానికి మార్గం సుగమం చేశారని కొనియాడారు,రాజకీయ పదవులకు తలొగ్గక, జాతి మేలుకోరి నిలబడ్డారని గుర్తుచేశారు, నూతనంగా ఏర్పడిన ఎమ్మార్పీఎస్ గ్రామ,మండల కమిటీ, ఎం.ఎస్.పి, ఎం.ఎస్.ఎఫ్, కమిటీల సభ్యులు మందకృష్ణ మాదిగ స్ఫూర్తితో, చురుకుగా పనిచేసి రాబోయే తరాలకు మార్గదర్శకం కావాలని సూచించారు, అనంతరం కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపుతూ, వృద్ధులు వితంతువులకు పండ్లు,ఫలాలను అందించి, మాదిగ సామాజిక వర్గ సీనియర్ పెద్దలు మందపల్లి నాగేశ్వరరావు,చంద్రమళ్ల యాకోబు లను యూత్ సభ్యులు సత్కరించారు. అనంతరం గ్రామంలోని దళితవాడ నుండి మండల కార్యాలయాల ప్రాంగణంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు‌. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ పేట పెద్దలు మందపల్లి నాగేశ్వరరావు, చంద్రమల్ల యాకోబు, వార్డు మెంబర్ మందపల్లి మణెమ్మ కొండలరావు, ఎం ఈ ఎఫ్ సభ్యులు కటకం అబ్బులు, ఇండుగమెల్లి అరుణ్ కుమార్, కందుకూరి గంగరాజు, చంద్రమల్ల చినవీరన్న, తాతారావు, మచ్చా సూర్యారావు, వెదురుపాక గ్రామ మాదిగ సామాజిక వర్గ పెద్దలు బొడ్డపాటి మహేష్, లంక సద్గుణ రావు, ఖండవిల్లి కిరణ్ కుమార్, రాయవరం గ్రామ యూత్ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తెలంగాణ
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo