కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో ఏపీఎస్ఆర్టీసీ నిడదవోలు డిపో బస్ సర్వీస్ ను కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. సోమవారం కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో జండా ఊపి ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కోవిడ్ నుండి బస్ సర్వీస్ లేక విద్యార్థులు, మహిళలు, వృద్దులు చాలా ఇబ్బందులకు గురాయ్యేనారని మద్దూరు కూటమి నాయకులు ఈ విషయాన్ని శుక్రవారం నాడు గ్రీవన్స్ లో నాద్రుష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం చొరవతో మళ్ళీ ఈ బస్ సర్వీస్ పునః ప్రారంభం చేస్తున్నారని. ఈ బస్ ఉదయం 8 మద్దూరు వస్తుందని… రూట్ నిడదవోలు నుండి సమిశ్రగూడెం, గోపవరం, విజ్జెశ్వరం మద్దూరు, బంగారమ్మపేట వాడపల్లి, ఔరాంగబాద్, టోల్గేట్ కొవ్వూరు మీదుగా రాజమహేంద్రవరానికి 4 ట్రిప్పులు షటిల్ సర్వీస్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు