కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది పైన అవుతున్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని కొవ్వూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ తలారి వెంకట్రావు అన్నారు. ఆదివారం కొవ్వూరు మండలంలోని మద్దూరు గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ కూటమి పర్పత్వం సంక్షేమ పథకాలను తుంగలోకి తొక్కిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయిందని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

