రాయవరం వృధ్ధాశ్రమంలోని వృద్ధులకు బ్రెడ్లు, పళ్ళు పంపిణీ
“స్నేహ స్వచ్ఛంద సేవ” ఆధ్వర్యంలో కార్యక్రమం
సాటి వారికి సేవ చేయడమే భగవంతుని సేవించడం అనే నినాదంతో సమాజ సేవకు జీవితాన్నే అంకితం చేసిన మహోన్నత సేవా మూర్తి మదర్ ధెరిస్సా అని, ఆమె జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదయకమని స్నేహ స్వచ్ఛంద సేవ అధ్యక్షురాలు డి ఆదిలక్ష్మి అన్నారు. మదర్ దెరిసా 115 వ జన్మదినం పురస్కరించుకొని మండల కేంద్రమైన రాయవరంలో గల అనాధ వృద్ధాశ్రమంలో సుమారు 40 మంది వృద్ధులకు స్నేహ స్వచ్ఛంద సేవ సభ్యులతో కలిసి బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్నేహ స్వచ్ఛంద సేవ సభ్యులు మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసిన విశ్వమాత, మదర్ థెరిస్సా అని, తన సేవలు ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన మహోన్నతమైన వ్యక్తి గా వెలుగొందారని, పేదల కోసం తోటి వారికి సహాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన మాతృమూర్తి మదర్ థెరిస్సా అని కొనియాడారు. ఆమె చూపిన మార్గం అనుసరణీయమన్నారు. మదర్ థెరిస్సా ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని, పలు దేశాల మధ్య యుద్ధాల సమయంలో ఆమె చూపిన తెగువ వెలకట్టలేనిదని వివరించారు. ఈ కార్యక్రమంలో స్నేహ స్వచ్ఛంద టీం సభ్యులు ఎస్. కృష్ణకుమారి, డి. ఆదిలక్ష్మి, సిహెచ్. సత్యవేణి, ఎమ్. వెంకటలక్ష్మి, కె. నాగ విజయలక్ష్మి, పి. సుబ్బరాజు, లచ్చిరెడ్డి వెంకటరమణ, నాగిరెడ్డి, ఎస్ దుర్గాప్రసాద్, ఎస్ తులసి తదితరులు పాల్గొన్నారు.