– అచ్చాయమ్మా కాలనీ 4 వ వీధి నందు శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే
వినాయక చవితి వేడుకలలో ప్లాస్టో ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్టించి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కొవ్వూరు పట్టణంలోని అచ్చాయమ్మా కాలనీ నాలుగో వీధి నందు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటుచేసిన మట్టి వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని సాంప్రదాయమైన పండుగలను నిర్వహించుకోవడంతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. వినాయచవితి వేడుకలలో మట్టి వినాయక విగ్రహాలని ఏర్పాటుచేసిన శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ అచ్చయమ్మ కాలనీ నాలుగో వీధి సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ద్వి సభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ సూరపనేని చిన్ని, తెలుగుదేశం సీనియర్ నాయకులు సూర్యదేవర రంజిత్ కుమార్, కొవ్వూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాయన రామకృష్ణ, కొవ్వూరు పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కాకర్ల సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు గోపిశెట్టి శివకృష్ణ, మహిళా మోర్చా నాయకులు గోపిశెట్టి భువనేశ్వరి తదితరులు పాల్గొని మట్టి వినాయకుని విగ్రహానికి పూజలు నిర్వహించారు

