ఉభయగోదావరి జిల్లాలో ఉన్న క్రైస్తవ సంఘాలు వాటి చరిత్ర సామాజిక సేవ, సాహితీ సేవ వంటి అంశాలను ప్రధానంగా తీసుకొని ఉభయ గోదావరి జిల్లాలోని ప్రముఖ క్రైస్తవ సంఘాల సాహిత్య సామాజిక సేవలు అనే అంశంపై మద్రాసు క్రైస్తవ కళాశాల భాషా విభాగాల అధిపతి ఆచార్య శ్రీపురం యజ్ఞ శేఖర్ పర్యవేక్షణలో పరిశోధన చేసి సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి మద్రాసు విశ్వవిద్యాలయం డాక్టరేట్ డిగ్రీ ని అందించిందని పరిశోధన చేసిన మరపట్ల రాజు తెలియజేశారు. తూర్పు మరియు పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉన్న చారిత్రాత్మకమైన క్రైస్తవ సంఘాల స్థాపన పాచ్చాత్యుల కృషి, వారు నిర్మించిన విద్య, వైద్యాలయాలు, కళాశాలలు మరియు వారిచే ప్రచురించిన సాహిత్యం, వారు సమాజానికి చేసిన సేవ, మత విధానాలు, ఆరాధన పద్ధతులు వంటి వాటిపై పరిశోధన చేసినట్లు తెలియజేశారు. మరపట్ల రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రక్రియల్లో గేయాలు, నాటికలు, నాటకాలు, వచన కవిత్వం, పద్య కవిత్వం, నవలలు, చారిత్రక కావ్యాలు, భక్తుల జీవిత చరిత్రలు వంటి అంశాలపై పరిశోధన చేసి సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి మద్రాసు విశ్వవిద్యాలయం పి హెచ్ డి డిగ్రీ ప్రకటించిందని తెలియజేశారు. మరపట్ల రాజు డిగ్రీ స్థాయి వరకు బీహెచ్ఎస్ఆర్ అండ్ వి ఎల్ ఎం దేవరపల్లి కళాశాలలోనూ, ఎంఏ తెలుగు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణులై, మద్రాసు క్రైస్తవ కళాశాల పరిశోధన కేంద్రంలో భాషల విభాగంలో మూడు సంవత్సరాలు పీహెచ్డీ చేసారని తెలియజేసారు. ఈ సందర్భంగా మద్రాసు క్రైస్తవ కళాశాల ప్రిన్సిపల్ విల్సన్ గారు అభినందనలు తెలియజేశారు.
ఈ పరిశోధనలో సూచనలు సలహాలు ఇచ్చి సాహిత్య పరంగాను, ఆర్థికంగానూ సహకరించిన గురువర్యులు నన్నయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ సహాయ చార్యులు డాక్టర్ తరపట్ల సత్యనారాయణకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధిపతి అయిన ఆచార్య విస్తాలి శంకర రావుకి కందుకూరి వీరేశలింగం ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్ సంజీవరావుకి కన్నడ శాఖ సహాయ చార్యులు డా.ఎ. మునిరాజాకి అభినందనలు తెలియజేశారు.

