13 October 2025
Monday, October 13, 2025

మంత్రి సుభాష్ చేతుల మీదుగా కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

మంత్రి సుభాష్ చేతుల మీదుగా కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట

విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం

మంత్రి సుభాష్ చేతుల మీదుగా కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట

 

రామచంద్రపురం నియోజకవర్గం విశ్వం వాయిస్ న్యూస్ :-

రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ మహా గణపతి,సుబ్రహ్మణ్యేశ్వర, వరాల కనకదుర్గ అమ్మవారి సువర్ణయంత్ర విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా సోమవారం జరిగింది. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ తన చేతుల మీదుగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరగడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు.అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని,ప్రతి ఒక్కరూ దైవచింతన,ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉండాలని అన్నారు.తొలుత మంత్రి సుభాష్ ఆలయ కమిటీ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మంత్రి సుభాష్ కు ఘన స్వాగతం పలికి సన్మానించారు.మంత్రి సుభాష్ తో పాటు,భక్త దంపతులచే యోగశాల ప్రదిక్షణ,విగ్నేశ్వర పూజ, మూల మంత్ర హోమములు,ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు,ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు,భక్తులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo