డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం కెనాల్ కాలువలో గుర్తుతెలియని సుమారుగా 70 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతదేహం స్థానికుల సమాచారంతో గుర్తించినట్లు రాయవరం ఎస్సై డి సురేష్ బాబు ప్రకటన ద్వారా తెలిపారు. గోధుమ రంగు చీర, ఎరుపురంగు జాకెట్ మృతురాలు ధరించి ఉందని ఆచూకీ తెలిసినవారు తమను సంప్రదించాలని మృతదేహాన్ని గుర్తించడంలో సోషల్ మీడియా గ్రూప్ ల ద్వారా సమాచారం మృతురాలి కుటుంబానికి అందేలా సహకరించాలని ఎస్సై సురేష్ బాబు కోరారు