బిడ్డ పుట్టిన గంటలోనే తల్లి యొక్క ముర్రుపాలు అమృతం లాంటివి
తల్లి పాలలో వున్న పోషక గుణాలు మరే ఇతర పాలల్లో వుండవు
ఐసిడిఎస్ సూపర్వైజర్ విష్ణుకుమారి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలం, మాచవరం సెక్టార్, సోమేశ్వరం గ్రామంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ విష్ణుకుమారి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలుత అంగన్వాడీ పిల్లల తల్లులకు, కార్యకర్తలకు సమావేశం ఏర్పాటు చేసి తల్లిపాల ప్రాముఖ్యతను, వాటి లాభాలను విష్ణుకుమారి వివరించారు తల్లిపాల వారోత్సవాలను వారం రోజులపాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తల్లి పాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేయడమే ఈ కార్య క్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఆమె చెప్పారు. బిడ్డకు ఆరు నెలల వరకు తల్లి పాలు తప్ప ఏ ఇతర ద్రవపదార్థాలు తాగించ కూడదని సూపర్వైజర్ తెలిపారు. బిడ్డ పుట్టిన గంటలోనే తల్లి యొక్క పసుపు రంగు చిక్కటి పాలు (ముర్రుపాలు) అమృతం లాంటివని, ఆమె పేర్కొన్నారు. వీటి ద్వారా బిడ్డకు అతిముఖ్యమైన పోషకాలు లభిస్తాయని, తల్లిపాలు బిడ్డ శరీరానికి, మెదడు కూడా పోషణను ఇస్తుందన్నారు. తల్లి పాలలో వున్న పోషక గుణాలు మరి ఏ ఇతర పాలల్లో వుండవని స్పష్టం చేశారు. మరి ముఖ్యంగా తల్లిపాలు శిశువును న్యుమోనియా, అతిసార వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతుందని, ముఖ్యంగా బిడ్డకు పాలివ్వడం వలన మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భసంచి వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుందని, అలాగే వేడివేడి పాలను ప్లాస్టిక్ సీసాలో వేసి నవజాత శిశువుకు పట్టడం వలన పిల్లలు భవిష్యత్తులో క్యాన్సర్ వంటి రోగాల బారిన పడతారని హెచ్చరించారు, అన్ని విధాలుగా మేలు చేసే తల్లిపాలు బిడ్డకు హక్కు అని రోగాలను దరిచేరనివ్వ ని తొలి టీకా అని , బిడ్డ జీవితానికి రక్షణ కవచం కనుక పిల్లల ఆరోగ్య భవిష్యత్తుకు బలమైన పునాది గా మారతాయని సూచించారు.
అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించి గ్రామంలోని పలు గృహాలను సందర్శించి, వారి కి తల్లి పాలు ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో తల్లులు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.