మండపేట పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మండపేట పరిధిలో మారేడుబాక గ్రామంలో సాయినగర్ ఖాళీ స్థలాల్లో కొంతమంది యువకులు గంజాయిని కలిగి ఉండి, మరియు గంజాయిని కాల్చుతున్నారు అనే సమాచారంతో ఎస్సై ఎన్. రాము రైడ్ ను నిర్వహించి మారేడుబాక గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను, అనపర్తి మండలంకు చెందిన ఒక యువకుడను మరియు మండపేట పట్టణానికి చెందిన 17 సంవత్సరాల బాలికను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి సుమారు ౩౦౦ గ్రాముల గంజాయిని సీజ్ చేసారని తెలిపారు. దీనిపై మండపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు Cr. No. 237/2025 U/s 8(c) R/w 20(b)(ii)(A) of NDPS Act-1985 కేసు ను నమోద చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు.ఈ రోజు అరెస్ట్ చేసిన ముద్దాయిలను రిమాండ్ కు మరియు బాలికను డి పి వో జువనైల్ వసతి గృహం, రాజమహేంద్రవరం వారి ముందు హాజరు పరిచామని తెలిపారు.

