Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications
Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications

మాధవపట్నం పాఠశాల విద్యార్థులు జాతీయ అథ్లెటిక్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

రాష్ట్రస్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్ క్రీడా పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపిక

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్

రాష్ట్రస్థాయి సౌత్ జోన్ క్రీడా పోటీలకు మాదపట్నం జడ్పీ పాఠశాలకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు టి.మురళీకృష్ణ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 3న పెద్దాపురం మహారాణి కాలేజీ క్రీడా మైదానంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ముగ్గురు క్రీడాకారులు ప్రతిభ కనబరిచారన్నారు. వీరు అండర్ – 18 విభాగంలో డి. రాజేష్ (1000 మీ) ప్రథమ స్థానం, ఎన్. యుగేష్ (400 మీ) ద్వితీయ స్థానం, అండర్- 14 విభాగంలో ఆర్.పవన్ గణేష్ (జావెలిన్) ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్రస్థాయి సౌత్ జోన్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వీరు ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు బాపట్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థులకు నిరంతరము క్రీడా శిక్షణ ఇచ్చే వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం. గోవిందు తర్ఫీదు ద్వారానే విద్యార్థుల విజయం సాధిస్తున్నారని ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి శివరామకృష్ణ, ఉప మండల విద్యాశాఖ అధికారి పుల్లయ్య, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
తెలంగాణ
తూర్పు గోదావరి
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
వనిత వాయిస్
కృష్ణా
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo