Sunday, August 3, 2025
Sunday, August 3, 2025

మాదిగల ఆత్మగౌరవం నిలబెట్టిన వ్యక్తి మందకృష్ణ మాదిగ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

మండలంలో పలు మాదిగ సామాజిక వర్గ కమిటీల నియామకం

 ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని పిలుపు

ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ సామ్రాట్ కె.బి మధు మాదిగ

రాయవరం

మందకృష్ణ మాదిగ కృషి మేరకు  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం మాదిగ జాతి విజయమని వర్ణిస్తూ, మండల కేంద్రమైన రాయవరంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి లంక చందు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ అద్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంఛార్జి డాక్టర్ సామ్రాట్ కె.బి మధు మాదిగ పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు జూలై 7వతేది ఎమ్మార్పీఎస్ 31వ వార్షికోత్సవం నాటికి ప్రతి గ్రామం, మండలంలో క్రియాశీలక సభ్యుల కమిటీలను ఏర్పాటు చేయాలని,ఈ క్రమంలో 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు వయసు గల విద్యావంతులైన యువకులను కమిటీల సభ్యులుగా నియమించాలని సూచించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ, మండల కమిటీ, మహాజన సోషలిస్ట్ పార్టీ మండల కమిటీ, మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ మండల కమిటీ లను నియమించారు రాయవరం గ్రామ కమిటీ అధ్యక్షులు గా గొట్టిముక్కల రాజు, వైస్ ప్రెసిడెంట్ చంద్రమల్ల అశోక్ , సెక్రెటరీ చంద్రమల్ల నిక్కీ, జాయింట్ సెక్రెటరీ చాట్ర సందీప్ కుమార్, ట్రెజరర్ జుత్తుక అభి, సభ్యులుగా యు.సుధీర్, ఎమ్.భాస్కర్, యు. ఆదిత్య,సి.హెచ్ పవన్ లను నియమించగా, ఎమ్మార్పీఎస్ మండల కమిటీ అధ్యక్షులు గా అయినవిల్లి కిషోర్, అధికార ప్రతినిధిగా వేమగిరి రాజేష్, ఉపాధ్యక్షులుగా లంక ఇస్సాకు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా డోకుబుర్ర అరుణ్, ప్రధాన కార్యదర్శిగా వేమగిరి రమేష్, కార్యదర్శి గా పలివెల ప్రణీత్, సహాయ కార్యదర్శి గా గంపల రాజు, కోశాధికారిగా లంక శ్రీను లను నియమించారు, మండల స్టూడెంట్స్ ఫెడరేషన్ కమిటీని నియమిస్తూ అధ్యక్షులుగా చుక్కా రాజశేఖర్, అధికార ప్రతినిధి చంద్రమల్ల సునీల్, ఉపాధ్యక్షులు చంద్రమల్ల సుదర్శన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఖండవెల్లి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి తాతపూడి రాకేష్, కార్యదర్శి లంక గంగరాజు, సహాయ కార్యదర్శి చుండ్రు రాజేష్ లను నియమించారు, అనంతరం మాదిగ సామాజిక వర్గం ఎప్పటికీ సైనికులుగా మిగిలిపోక, రాజ్యాధికారం పొందేలా ముందుకు సాగాలని మహాజన సోషలిస్ట్ పార్టీని మందకృష్ణ మాదిగ  స్థాపించడం జరిగిందని వివరించి, మహాజన సోషలిస్ట్ పార్టీ మండల కమిటీని నియమించారు. ఈ కమిటీలో అధ్యక్షులు గా మచ్చా అబ్బులు, అధికార ప్రతినిధి చాపల నరేంద్ర, ఉపాధ్యక్షులు దొండపాటి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లేటి భాస్కర్, ప్రధాన కార్యదర్శి పలివెల సుధీర్, కార్యదర్శి చంద్రమల్ల సంజయ్ రాజు, సహాయ కార్యదర్శి గొర్త విజయ్ కుమార్, కోశాధికారి గా  లంక శ్రీను ను నియమించారు‌. నియమింపబడిన కమిటీలు  పేరుకు ఉన్నట్టుగా కాక,చురుకుగా వ్యవహరించాలని సూచిస్తూ జూలై 7 ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవం రోజున మండలంలోని ప్రతి గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించాలని, సీనియర్ నాయకులతో జెండా ఆవిష్కరణ చేయించి గౌరవించాలని, మండపేట పట్టణంలో జరిగే వేడుకలకు జన సమీకరణ చేపట్టాలని సూచించారు. అనంతరం ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ సామ్రాట్ కె.బి మధు మాదిగ ను అందరూ కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహాజన్ సోషలిస్ట్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధూళి జయరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి నేదునూరి రాజేష్ మాదిగ, మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ చుక్కా శేషు మాదిగ, రాయవరం మండల ఇంచార్జ్ తాతపూడి రత్నం, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మందపల్లి కొండలరావు, ఎం.ఈ.ఎఫ్ సభ్యులు కటకం అబ్బులు మాదిగ సామాజిక వర్గ పెద్దలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo